కడపలో దంపతుల దారుణ హత్య

కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కొత్త బసాపురం లో నాగయ్య – నాగమ్మ అనే దంపతులను దారుణంగా హత్య చేశారు. తెల్లవారు జామున వారు ఇంట్లో నిద్రి స్తుండగా హత్యకు పాల్పడ్డాడు హంతకుడు వీర‌య్య. అయితే…ఈ ఘటన లో మృతి చెందిన వారికి నిందితుడు వీర‌య్య కొడుకు వరుస అవుతాడని తెలుస్తోంది. మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేక పెద్దమ్మ నాగ‌మ్మ, పెద్దనాన్న నాగ‌య్య ల‌ను హ‌త్య చేసిన‌ట్లు స్థానికులు అంటున్నారు. అయితే.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితున్న అరెస్ట్‌ చేశారు. ఈ హత్య జరగడానికి గల కారణాల పై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-