మ‌రోషాక్‌: డ్రాగ‌న్ ఫ్రూట్‌లో క‌రోనా వైర‌స్‌… సూప‌ర్ మార్కెట్లు బంద్‌…

ఫిబ్ర‌వ‌రిలో వింట‌ర్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని చైనా జీరో వైర‌స్ కు క‌ట్టుబడి నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్న‌ది.  క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధిస్తూ క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  మూడు నాలుగు కేసులు బ‌య‌ట‌ప‌డినా… ఆయా న‌గ‌రాల్లో వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు లాక్‌డౌన్ ను అమ‌లు చేస్తున్న‌ది. ఇప్ప‌టికే జియాంగ్‌, యూనాన్, యుజౌ న‌ర‌గాల్లో లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న‌ది.  లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న న‌ర‌గాల్లోని ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌పై ప్ర‌భుత్వం నిరంత‌రం నిఘాలు ఉంచింది డ్రాగ‌న్ స‌ర్కార్‌.  

Read: ప్రధాని కాన్వాయ్ ఘటన ఓ డ్రామా.. హీరో సిద్ధార్థ్ వరుస ట్వీట్లు

ఇక ఇదిలా ఉంటే, చైనాలో క‌రోనా వివిధ మార్గాల ద్వారా వ్యాపిస్తున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  తాజాగా డ్రాగ‌న్ ఫ్రూట్స్ ద్వారా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న‌ట్టు అధికారులు గుర్తించారు.  తైవాన్ నుంచి దిగుమ‌తి చేసుకున్న డ్రాగ‌న్ ఫ్రూట్‌లో వైర‌స్‌ను గుర్తించారు.  అత్యాధునిక స్కానింగ్ ద్వారా డ్రాగ‌న్ ఫ్రూట్‌ల‌లో వైర‌స్ ఉన్న‌ట్టు గుర్తించ‌డంతో జేజియాంగ్, జియాంగ్ షీ ప్రావిన్స్‌లోని 9 న‌గ‌రాల్లోని సూప‌ర్ మార్కెట్ల‌ను మూసివేశారు.  పండ్ల‌ద్వారా వైర‌స్ వ్యాపించ‌ద‌ని, డ్రాగ‌న్ ఫ్రూట్స్ ద్వారా వైర‌స్ ఎలా వ్యాపిస్తున్న‌దో అర్ధం కావ‌డం లేద‌ని చైనా అధికారులు చెబుతున్నారు.  ముందు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా తైవాన్ నుంచి దిగుమ‌తుల‌ను నిలిపివేసి,  సూప‌ర్ మార్కెట్ల‌ను బంద్ చేశారు.  

Related Articles

Latest Articles