సండే కూడా కరోనా వ్యాక్సిన్, టెస్టింగ్

కరోనా కేసుల తీవ్రత రోజూ పెరుగుతోంది. వైద్యులు, వైద్య విద్యార్ధుల్ని కూడా మహమ్మారి వదలడం లేదు. కరోనా వేళ గర్భిణులకు సర్కారు భరోసా ఇచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సర్వీసులను మాత్రమే చూడాలని ఆదేశాలున్నా కోవిడ్ బాధిత గర్భిణుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం కూడా కరోనా వాక్సినేషన్, టెస్టింగ్ చేయాలన్నారు.

ఆపరేషన్ థియేటర్లు, వార్డుల కేటాయింపు ..ఇతర పాజిటివ్ బాధితులకు అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సల కోసం కూడా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్కడిక్కడే వారికి నాణ్యమైన చికిత్స అందించాలని, అత్యవసరం అయితేనే హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు హరీష్ రావు. వైద్యారోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ సమకూర్చారు. ఏ ఒక్క పేషెంట్ కి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. బస్తీ దవాఖానలు, పీహెచ్‌సిలు, సబ్ సెంటర్లల్లో సేవలు అందుబాటులో వుండాలన్నారు. ఫ్రంట్ లైన్ వారియ‌ర్లు స‌హా అంద‌రికి వేగంగా వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశాలిచ్చారు.

Related Articles

Latest Articles