మాస్క్‌లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చేవారికి క‌రోనా టెస్టులు…

క‌రోనా కాలంలో మాస్క్ ధ‌రించ‌డం కామ‌న్ అయింది.  మాస్క్‌లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే క‌రోనా నుంచి ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది.  దీంతో దాదాపుగా ప్ర‌జ‌లు మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇష్టప‌డటంలేదు.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ప్ర‌జ‌లు కొంత నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  కొంత‌మంది మాస్క్ పెట్టుకోకుండా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  వీరి నుంచి మిగ‌తావారికి ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంటుంది.  

Read: బీహార్‌లో వింత‌కేసుః క‌ల‌లోకి వ‌చ్చి అత్యాచారం చేస్తున్నాడ‌ని…

అంతేకాకుండా థ‌ర్డ్ వేవ్ ముప్పుకూడా పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని తిరుప్పూర్ జిల్లాలోని ప‌ల్ల‌డం మున్సిపాలిటీ వినూత్న నిర్ణ‌యం తీసుకుంది.  మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చే వారికి క‌రోనా టెస్టులు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  పోలీసులు, వైద్యశాఖాదికారుల స‌మ‌న్వ‌యంతో ప‌ల్ల‌డం మున్సిపాలిటి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.  గురువారం రోజున మాస్క్ లేకుండా బ‌య‌ట క‌నిపించిన 100 మందికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన‌ట్టు అధికాల‌రులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles

-Advertisement-