తెలంగాణ పల్లెలకు కరోనా టెన్షన్‌.. కారణం ఇదే..!

కరోనా మహమ్మారి మరోసారి పల్లెలను టెన్షన్‌ పెడుతోంది.. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మళ్లీ మహరాష్ట్ర టెన్షన్ పట్టుకుంది.. దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కరోనా కేసులు అక్కడే నమోదు అవుతుండగా.. దాన్ని ఆనుకోని ఉన్న తెలంగాణ జిల్లాలైనా ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లాకు కరోనా భయం పట్టిపీడిస్తుంది.. మరి ముఖ్యంగా మహారాష్ట్రలో రోజుకు వేలకు పైగా కరోనా కొత్తకేసులు నమోదు అవుతుండగా అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ సరిహద్దు పంచుకున్న యవత్మాల్ జిల్లా, నిర్మల్ జిల్లాకు నాందేడ్ జిల్లామంచిర్యాల జిల్లాకు గడ్చిరొలి, ఆసిఫాబాద్ జిల్లాకు చంద్రాపూర్, గడ్చిరొలి జిల్లాలు సరిహద్దును పంచుకోని ఉండగా సరిహద్దుల వద్ద ఎలాంటి ఆంక్షలు లేవు. రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా రాకపోకలు సాగుతున్నాయి..

Read Also: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌.. మన స్థానమంటే..?

నిర్మల్ జిల్లాలోని బీద్రెల్లి, బేలాతరోడా అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని లక్ష్మిపూర్, డొల్లార, కొబ్బాయితోపాటు మంచిర్యాల జిల్లాలో అర్జున గుట్ట తోపాటు తదితరప్రాంతాల్లో చెక్ పోస్టులున్నాయి.. అయితే మహా రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం పైగా అధికారులు థర్మల్ స్కీనింగ్ టెస్టింగ్ చేస్తున్నామని అధికారులు చెప్పుతున్నా క్షేత్ర స్థాయిలో ఆపరిస్థితి కనిపించడం లేదు. మహా భయం ఒకవైపు పండగల సీజన్ మరో వైపు ఉండగా పట్నం జనం పల్లెలకు రావడంతో కరోనా కేసుల సంఖ్య పెరిపోతుంది.. తాజాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వందల కేసులు నమోదు అవుతున్నాయి.. ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ డిజిట్ కేసులునమోదు అవుతుండగా మంచిర్యాల జిల్లాలో ట్రిపుల్ డిటిజ్ కేసులు ఈ మధ్య నమోదు అయ్యాయి.. నిర్మల్ ,ఆసిఫాబాద్ లో సింగల్ డబుల్ డిజిట్ కేసులు నమోదు అవుతుండగా వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నామంటున్నారు.. కరోనా కట్టడి కోసం చర్యలు చేపట్టామంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో 143 కేసులు ఆదిలాబాద్ జిల్లాలో 25 కేసులు నమోదు కాగా నిర్మల్ 16 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. అసలే వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు కరోనా నియమాలు పాటించక పోవడం, మహా రాష్ట్ర భయం ఒకవైపు వెంటాడుతొండగా ఇంకో వైపు హైదరాబాద్ భయం పట్టిపీడిస్తోంది.. పండగల కోసం పట్నం జనం పల్లెల్లోకి రావడం కరోనా పెరగడానికి కారణంగా మారిపోతుంది.. అధికారులు అప్రమత్తం చేసినా చేయకున్నా జనం మన జాగ్రత్తలో మనం ఉంటే కరోనా బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.

Related Articles

Latest Articles