గోవా క్రూయిజ్ షిప్‌లో కరోనా టెన్షన్… 66మందికి పాజిటివ్

కరోనా ఎప్పుడు, ఎలా, ఎక్కడినించి వస్తుందో తెలీదు. అందుకే మన జాగ్రత్తల్లోమనం వుండాలి. గోవా క్రూయిజ్ షిప్‌లో కరోనా పంజా విసరడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2000 మందికి టెస్టులు చేయగా వారిలో 66 మందికి పాజిటివ్ అని తేలింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం 2వేల మంది ముంబయి నుంచి గోవాకు బయల్దేరి వెళ్లారు. ఒమిక్రాన్ భయం వెంటాడుతున్నా సెలబ్రేషన్స్ మాత్రం ఆపలేదు. చివరకు ముంబయి నుంచి గోవా తీరం చేరగానే అధికారులు పీపీఈ కిట్ ధరించి షిప్ ఎక్కారు. అందరికీ కరోనా టెస్టులు చేశారు.

అంతమందిలో 66 మందికి పాజిటివ్ అని తేలడంతో అధికారులు వారిని ఎక్కడ వుంచాలనే దానిపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రూయిజ్ షిప్ కి పెద్ద చరిత్ర వుంది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కొడుకు ప్రయాణిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు చేసింది ఈ షిప్‌లోనే. నూతన సంవత్సర వేడుకలకు దేశవ్యాప్తంగా చాలా మంది గోవా బీచ్‌కి వెళ్లి వేడుకలు చేసుకోవడం పరిపాటి. ఈ ఏడాది కూడా ఒమిక్రాన్ ముప్పు ఉన్నా అంతా ఛలో గోవా అనేశారు. అదే వారి కొంప ముంచేసింది. జపాన్‌లో గతంలో క్రూయిజ్ షిప్‌లో వారికి కరోనా సోకింది. స్త్రకంగా 7వందల మంది కరోనా బారిన పడ్డారు. దీంతో షిప్ మొత్తాన్ని ఇతర ప్రాంతాలకు పంపకుండా సముద్ర జలాల్లోనే వుంచేశారు.

Related Articles

Latest Articles