బాలీవుడ్ నూ కుదిపేస్తున్న కరోనా!

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘వాక్సినేషన్ చేయించుకున్నప్పటికీ నాకు కరోనా వచ్చింది. దానికి సంబంధించిన తేలికపాటి లక్షణాలు నాకు ఉన్నాయి’ అని ‘పేజీ 3’ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కొవిడ్ టేస్టు చేయించుకోవాలని, అలానే కొవిడ్ 19 ప్రోటోకాల్ ను పాటించాలని మధుర్ కోరాడు. ఇదిలా ఉంటే ‘ఫోర్ మోర్ షార్ట్స్’ ఫేమ్ మాన్వీ గగ్రూకి సైతం కరోనా వచ్చింది.

కోవిడ్ 19కు సంబంధించిన తేలిక పాటి లక్షణాలు తనకున్నాయని, దాంతో విశ్రాంతి తీసుకుంటున్నానని ఓ ఫోటోతో పాటు మాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అలానే టెలివిజన్ సీరిస్ ‘ఘుమ్ హై కిసికే ప్యార్ మే’లో నటిస్తున్న ఆయేషా సింగ్ కు సైతం కొవిడ్ 19 పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో ఆ షోకు సంబంధించిన మొత్తం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆయేషా సింగ్ గురించి నిర్మాత రాజేశ్‌ రామ్ సింగ్ తెలియచేస్తూ, ‘ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించాం. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే వైద్యం చేయించాం. ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉంది. దాంతో మొత్తం యూనిట్ సభ్యులకు కూడా టెస్టులు చేయించి, ఎవరికి వారిని కొద్ది రోజులు ఐసొలేషన్ లో ఉండాల్సిందిగా కోరాం. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నాం” అని అన్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో స్వర భాస్కర్, విశాల్ దద్లాని, జాన్ అబ్రహం, ఏక్తా కపూర్, రియా కపూర్ నోరా ఫతేహీ, అర్జున్ రామ్ పాల్, శిల్పా శిరోద్కర్ తదితరులు కరోనా బారిన పడి కోలుకున్నారు.

Related Articles

Latest Articles