ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా.. 24 గంటల్లో 1,445 కేసులు

ఆంధ్ర ప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. కొత్తగా 1445 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి.. మరో 11 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇక ఇదే సమయంలో 1,243 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2, 74, 75, 461 కు చేరుకున్నాయి… మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14030 కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14, 603 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. ఇక, పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,33, 419 కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,04,786 కు చేరుకుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-