స్పీకర్‌ పోచారంకు కరోనా.. మరి సీఎంల సంగతేంటి..?

తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రెగ్యులర్‌ టెస్ట్‌లతో పాటు చేసిన టెస్టుల్లో కోవిడ్ సోకినట్లు తెలిసింది. ఈ క్రమంలో కోవిడ్‌ సోకినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పోచారం వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని రోజుల తనతో సన్నిహితంగా మెదిలిన వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

స్పీకర్‌ పోచారంకు కరోనా.. మరి సీఎంల సంగతేంటి..?

అయితే ఇటీవల పోచారం శ్రీనివాస్‌ మనవరాలి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌లతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హజరయ్యారు. ఇప్పుడు పోచారంకు కరోనా సోకినట్లు తెలియడంతో మరి ఇరు రాష్ట్రాల సీఎంల పరిస్థితి ఏంటంటూ.. చర్చించుకుంటున్నారు. మొన్నామధ్య కేసీఆర్‌కు కోవిడ్‌ సోకి కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles