బ్రేకింగ్‌ : స్పీకర్‌ పోచారంకు కరోనా పాజిటివ్‌

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయింది. ఇవాళ చేసిన కరోనా పరీక్షల్లో… పోచారం శ్రీనివాస రెడ్డికి కరోనా సోకింది. కరోనా మహమ్మారి సోకడంతో… ఆస్పత్రిలో చేరారు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో తనకు పాజిటివ్ నమోదు అయిందని… ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు AIG, గచ్చిబౌలి హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని కోరారు పోచారం శ్రీనివాసరెడ్డి. అయితే… గత నాలుగు రోజుల క్రితం.. జగన్, కేసీఆర్ లతో పోచారం.. తన మనువరాలి పెళ్లి నేపథ్యంలో… విందు చేశారు. దీంతో ఆ ఇద్దరు సీఎంలు టెన్షన్ కు లోనవుతున్నట్లు సమాచారం.

Related Articles

Latest Articles