రాజన్న సిరిసిల్లాలో దారుణం : అత్తకు కరోనా.. కోడలును బలవంతంగా కౌగిలించుకుని మరీ..!

రాజన్న సిరిసిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ అత్త తనకు కరోనా వచ్చిందని కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లాలోని నేమిలీగుత్త తండా వాసితో మూడేళ్ళ కింద పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల కింద ఒడిశా వెళ్ళాడు. అక్కడే ట్రాక్టర్ డ్రైవరు గా పని చేస్తున్నాడు. అయితే 5 రోజుల కింద ఏ అత్తకు కరోనా సోకింది. దీంతో అత్త హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. కోడలు సామాజిక దూరం పాటించడాన్ని అత్త భరించలేకపోయింది, ఇంకేముంది తన శాడిజం చూపింది. కోడలిని తరచూ కౌగిలించుకుంది. దీంతో ఆ కోడలికి కూడా కరోనా సోకింది. అంతే కాదు చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా ఆమెను బయటకు నెట్టేశారు. ఈ దారుణాన్ని గ్రహించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కోడలు, అత్త హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-