పర్యాటక రంగంపై కరోనా ఎఫెక్ట్..బోసిపోయిన వైజాగ్ !

వైజాగ్ అంటేనే టూరిజానికి కేరాఫ్ అడ్రస్. బీచ్, అరకు లోయలు, ఏజెన్సీ ప్రాంతాలు, జలపాతాల సందడి… టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. సాధారణ రోజుల్లో కంటే సీజనల్ డేస్ లో పర్యాటక ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. అలాంటి టూరిజంపై కరోనా ప్రభావం పడింది. విశాఖలో ట్రావెల్స్ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారు అధికంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 700 పైగా చిన్నా చితకా ట్రావెల్ ఏజెన్సీ లు ఉన్నాయ్. కరోనా వల్ల గత ఏడాది నుంచి వ్యాపారం సాగకపోవడంతో వారంతా ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. సగానికి సగం ఫినాన్షియల్ గా ఇబ్బందులు పడుతూ.. మూసివేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

read also : కరోనా తగ్గుముఖం.. జులై 19 తరువాత అన్ని ఆంక్షలు ఎత్తివేత

విశాఖకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు తరచూ వస్తుంటారు. రాష్ట్రానికి వచ్చే వారిలో ఎక్కువమంది ఏజెన్సీ ప్రాంతాలను, జలపాతాలు, కొండ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఏటా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పొరుగు దేశాల నుంచి వందల మంది నగరంలోని టూరిజం స్పాట్స్ సందర్శనకు వస్తారు. కరోనా పుణ్యమా అని… రెండేళ్లుగా ఎవరూ రావడంలేదు. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బుకింగ్ లతో బిజీబిజీగా ఉండే ట్రావెల్ ఏజెన్సీ లు… ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

సాధారణ రోజుల్లో నగరంలోని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసులన్నీసందడిగా ఉండేవి. వాహనాల గిరాకీతో పాటు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్యాకేజీలు నిర్వహించేవారు. కరోనా వల్ల జనం ఎంతో అత్యవసరమైతే తప్ప ఎక్కడా బయటకు వెళ్లడం లేదు. దూర ప్రయాణాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పర్యాటక వ్యాపారాల మీద కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పర్యాటక సంస్థల నిర్వహణ, ఉపాధికల్పన భారంగా మారుతోంది. ఈ సమయంలో పన్ను విరమణ, ఇతర మినహాయింపులిచ్చి ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు నిర్వాహకులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-