తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 2606..

కరోనా మహమ్మారి విజృంభన రోజురోజుకు క్రమంగా పెరుగూ వస్తోంది. ఇప్పటికే దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో 73,156 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,606 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇద్దరు కరోనా బారినపడి మరణించారు.

అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 285 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 97.65 శాతంగా ఉంది. అయితే జీహెచ్‌ఎంసీలో 1583 కొత్త కరోనా కేసులు రాగా, రంగారెడ్డిలో 214, మేడ్చల్‌లో 292 కేసులు వచ్చాయి.

Related Articles

Latest Articles