ఏపీలో కొత్తగా 334 కరోనా కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,77,942 కి పెరిగాయి. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 499 కి చేరింది.

Read Also:కోవిడ్‌ నేపథ్యంలో ..హైకోర్టులో ప్రత్యక్ష విచారణ నిలిపివేత

ప్రస్తుతం రాష్ట్రంలో 1516 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 95 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,61,927 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 28,311 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు 3,14,25,946 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Related Articles

Latest Articles