ఏపీలో కొత్తగా 547 కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజులో 500కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 96 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 89, కృష్ణా జిల్లాలో 66, గుంటూరు జిల్లాలో 49 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 128 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,78,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,62,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,266 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,500కి చేరింది.

Related Articles

Latest Articles