భారత్ లో మరిన్ని తగ్గిన కరోనా కేసులు…

ఇండియాలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్త‌గా 1,14,460 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,88,09,339 కి చేరింది. ఇందులో 2,69,84,781 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,77,799 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 2,677 మంది మృతి చెందారు. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,46,759 కి చేరింది. ఇక 24 గంటల్లో 1,89,232 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-