ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు

ఏపీలో క‌రోనా విజృంభిస్తోంది. కేసులు భారీ సంఖ్యలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైనా మొత్తం కేసుల సంఖ్య 20,93,860 కు చేరింది. ఇందులో 20,61,039 మంది కోరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 14,508 మంది మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,313 గా ఉంది. కాగా గడిచిన 24 గంటల్లో 418 మంది కోవిడ్‌ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారని ఏపీ వైద్యాధికారులు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

అయితే కోవిడ్‌తో ఇవాళ ఒకరు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,17,96,337 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్యాధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో అనంతపూర్‌లో 300 పాజిటివ్‌ కేసులు, చిత్తూర్‌లో 1022, ఈస్ట్‌ గోదావరి327, గుంటూరులో 337, కృష్ణాలో166, కడపలో 236, కర్నూల్‌లో 164 విశాఖపట్టణంలో 992, శ్రీకాకుళంలో 385 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు వెల్లడించారు.

Related Articles

Latest Articles