తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా ఎన్నికేసులంటే..?

కరోనా రక్కసి మరోసారి తెలంగాణాలో రెక్కలు చాస్తోంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో యావత్తు దేశంతో పాటు తెలంగాణవాసులూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ కూడా తెలంగాణలో వ్యాప్తి చెందుతుండడంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది.

అయితే తాజాగా తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,052 కరోనా కేసులు రాగా, ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో మరో 240 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 94కి ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య చేరింది.

Related Articles

Latest Articles