చిక్కుల్లో రామ్, లింగుసామి “రాపో19”

తమిళ చిత్ర పరిశ్రమలో కాపీ వివాదాలు సర్వ సాధారణం అయిపోయాయి. గతంలో ఎ.ఆర్.మురుగదాస్, శంకర్ వంటి దర్శకులు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పందెం కోడి’ ఫేమ్ లింగుసామి కూడా ఈ జాబితాలో చేరిపోయారు. లింగుసామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఆ మూవీపై మరో తమిళ దర్శకుడు సీమాన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోలీవుడ్ మీడియా కథనం ప్రకారం లింగుసామి ఈ కథను 2013లో రాసి, సూర్యతో కలిసి రూపొందించాలని ప్లాన్ చేశారట. కానీ ఈ కథ తాను విజయ్ తో తీయాలనుకున్న ‘పగళవన్’ కథను ఆ కథ పోలి ఉందంటూ అప్పట్లోనే ఫిర్యాదు చేశారట.

Read Also : ‘ద ఫ్యామిలి మెన్’ రాజ్ అండ్ డీకే… టాలీవుడ్ పై కాన్సన్ట్రేషన్!

దీంతో ఇద్దరూ ఒకేలాంటి కథను రాసుకున్నారని తెలుసుకుని, తమిళనాడు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించింది. ఆ తరువాత లింగుసామి సూర్య కోసం వేరే కథ రాసి 2014లో ‘అంజన్’గా చేశాడు. మరోవైపు సీమాన్ ‘పగళవన్’ని తెరకెక్కించలేకపోయాడు. అయితే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత అప్పట్లో వివాదానికి కారణమైన స్క్రిప్ట్ నే లింగుసామి మరోసారి ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్న సీమాన్ మరోసారి సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అసోసియేషన్ లింగుసామి నుండి వివరణ కోరినప్పుడు, ఈ సమస్య 2013లోనే పరిష్కరించబడిందని, అక్కడ డైరెక్టర్ల సంఘం నుండి క్లీన్ చిట్ వచ్చిందని అన్నారు. తమిళం మినహా ఇతర భాషలలో ఈ స్క్రిప్ట్‌తో సినిమాను తెరకెక్కించవచ్చని పేర్కొన్నాడు. అతని వివరణను పరిశీలించిన తరువాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ లింగుసామికి క్లీన్-చిట్ ఇచ్చి, అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని పేర్కొంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-