మారిన వాతావరణం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు

విశాఖలో వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మారిపోయింది. అక‌స్మాత్తుగా ఆకాశంలో మేఘాలు క‌మ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-