‘మా’లో మళ్లీ మొదలైన రచ్చ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో మళ్లీ రచ్చ మొదలైంది. మా ఎన్నికలు జరిగి నెలరోజులు దాటినా.. కొత్త ప్యానెల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ఓపెన్ చేయడం లేదని కొందరు నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఇలా జరగలేని ప్రకాష్ రాజ్ ప్యానెల్ వర్గం నటీనటులు ఆరోపిస్తున్నారు. మా కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా మూసిఉంటోందని.. దాంతో తాము నిరాశగా వెనుతిరగాల్సి వస్తోందని చెబుతున్నారు.

Read Also: బాలయ్య కోసం బరిలోకి దిగిన ఐకాన్ స్టార్

కాగా ఇటీవల జరిగిన మా ఎన్నికలు ఎంత హాట్‌హాట్‌గా జరిగాయో చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల మధ్య తరచూ వివాదాలు, గొడవలు జరిగాయి. ఎన్నికల రోజు కూడా రెండు ప్యానెళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, దాడులు చేసుకున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి రెండు ప్యానెళ్ల సభ్యులు సైలెంట్‌గా ఉండటంతో అంతా సద్దుమణిగిందని పలువురు భావించారు. కానీ మా కార్యాలయం తెరిచే విషయంలో మళ్లీ రెండు వర్గాల మధ్య రచ్చ మొదలైంది. మరి ఈ రచ్చ ఎటువైపుకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Related Articles

Latest Articles