రైతులపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: పొన్నాల

సీఎం కేసీఆర్‌కు రైతుల సమస్యలపై చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్‌ఎస్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. వరి కల్లాల్లో ధాన్యం ఉన్న కొనకుండా కేసీఆర్‌ సర్కార్‌ ఏం చేస్తుందంటూ ఫైర్‌ అయ్యారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌ మెంట్‌ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. కేసీఆర్‌.. ప్రధాని మోడీ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయడం లేదని ప్రశ్నించారు.

కేంద్రం, టీఆర్‌ఎస్‌ డ్రామాలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు పొన్నాల. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులు పెడితే చూస్తు ఊరుకోబోమన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం చేస్తున్నారో .. ప్రజలకు చెప్పాలన్నారు. యాసంగిలో వరిపంట వేయోద్దని ఎందుకు చెబుతున్నారని, ఢీల్లీలోనే ఉన్న పంటను కొనమని కేసీఆర్‌ ఎందుకు అడగటం లేదని ఆయన ఆరోపించారు. త్వరలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పొన్నాల హెచ్చరించారు.

Related Articles

Latest Articles