వ్యాక్సినేష‌న్‌పై చిదంబ‌రం విమ‌ర్శ‌లు…మోడికి నోబెల్ బ‌హుమ‌తి ఇస్తారేమో..!!

క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో జూన్ 21 వ తేదీనీ ఇండియా ప్ర‌పంచ రికార్డ్‌ను సృష్టించింది.  ఉచిత టీకాల‌ను ప్ర‌తిపాదించిన మొద‌టిరోజే ఇండియాలో 88 ల‌క్ష‌ల మందికి టీకాలు వేశారు.  అయితే, రెండో రోజు ఆ సంఖ్య 54 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది.  దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పీ చిదంబ‌రం స్పందించారు.  మోడీ ఉంటే ఇలాంటి అద్భుతాలు సాధ్య‌మే అని, బ‌హుశా ఈ రికార్డ్ కు నోబెల్ బ‌హుమ‌తి ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని అన్నారు.  

Read: ఆ వ్యాఖ్యలు ఆంధ్రప్రజలను ఉద్దేశించింది కాదు: మంత్రి వేముల

ఆదివారం రోజుల వ్యాక్సిన్‌ల‌ను కూడ‌బెట్టి వాటిని సోమ‌వారం రోజున వేశార‌ని, మంగ‌ళ‌వారం రోజున య‌ధావిధిగా ఇబ్బందులు మొద‌ల‌య్యాయ‌ని, ప్ర‌పంచ‌రికార్డ్ వెనుక ఉన్న ఆంత‌ర్యం ఇదేన‌ని చిదంబ‌రం విమ‌ర్శ‌లు చేశారు.  ఈ విమ‌ర్శ‌ల‌ను బీజేపీ తిప్పికొట్టింది.  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేష‌న్ ఆల‌స్యం కారణంగానే నిన్న‌టి రోజున వ్యాక్సినేష‌న్ త‌గ్గింద‌ని కౌంట‌ర్ ఇచ్చారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-