నేడు కాంగ్రెస్ నేత‌ల స‌త్యాగ్ర‌హ దీక్ష‌… ఎందుకంటే…

రాష్ట్రంలో క‌రోనాకు, బ్లాక్ ఫంగ‌స్‌కు పూర్తిగా ఉచిత చికిత్స‌ను అందించాల‌ని డిమాండ్ చేస్తు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు హైద‌రాబాద్‌లోని గాంధి భ‌వ‌న్‌లో స‌త్యాగ్ర‌హ దీక్షకు దిగుతున్నారు.  ఉద‌యం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు సత్యాగ్ర‌హ దీక్ష చేయ‌బోతున్నారు.  రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాల‌ని కూడా కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.  క‌రోనాను ఆరోగ్య‌శ్రీలో చేర్చాల‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-