చ‌లో రాజ్‌భ‌వ‌న్‌: కాంగ్రెస్ నేత‌లు అరెస్ట్‌…

చ‌లో రాజ్‌భ‌వ‌న్ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వ‌డంతో ఇందిరాపార్క్ వద్ద‌కు భారీ సంఖ్య‌లో నేతలు, కార్య‌క‌ర్త‌లు చేరుకున్నారు.  ర్యాలీగా రాజ్‌భ‌వ‌న్ కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  కాంగ్రెస్ నేత‌లు, పోలీసుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది.  ఇక కాంగ్రెస్ ముఖ్య‌నాయ‌కులైన భ‌ట్టి విక్ర‌మార్క‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్‌, జ‌గ్గారెడ్డి, ఏఐసీసీ కార్య‌క్ర‌మాల ఇన్‌చార్జ్ మ‌హేశ్వ‌ర్ రెడ్డిల‌ను పోలీసులు అరెస్ట్ చేసి అబిడ్స్ పీఎస్‌కు త‌ర‌లించారు.  ఇక‌, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీత‌క్క‌, యూత్ కాంగ్రెస్ నేత శివ‌సేనారెడ్డిల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అటు రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకున్న కాంగ్రెస్ కార్య‌కర్త‌లను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు.  దీంతో రాజ్‌భ‌వ‌న్ ప్రాంతంలో ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  

Read: నాన్నపై ‘మీ టూ’ ఆరోపణలు! స్పందించిన డైరెక్టర్స్ డాటర్…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-