కాంగ్రెస్‌కు మ‌రోషాక్‌: బీజేపీలోకి 8 మంది ఎమ్మెల్యేలు…

మ‌ణిపూర్ కాంగ్రెస్ కు మ‌రోషాక్ త‌గిలింది.  ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తున్న బీజేపీ ధాటికి కాంగ్రెస్ పార్టీ కుదేల‌వుతున్న‌ది.  వ‌చ్చే ఏడాది అనేక రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఇలా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న రాష్ట్రాల్లో మ‌ణిపూర్ కూడా ఒక‌టి.  మ‌ణిపూర్ కాంగ్రెస్ పార్టీ క‌మిటీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి గోవిందాస్ రాజీనామా చేశారు.  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గోవిందాస్‌తో పాటుగా మ‌రో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేర‌బోతున్నారు.  ఈశాన్య‌రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ క్ర‌మంగా మ‌స‌క‌బారుతున్న‌ది.  

Read: చరణ్-శంకర్ సినిమా: కథానాయిక అనౌన్స్ మెంట్ వచ్చేస్తోంది!

మ‌రో ఏడాది కాలంలో మ‌ణిపూర్ రాష్ట్రానికి ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌బోతున్న త‌రుణంలో గోవిందాస్ రాజీనామా చేయ‌డం ఆ పార్టీకి తీర‌ని లోట‌ని నిపుణుల విశ్లేషిస్తున్నారు.  గోవిందాస్ బిష్నాపూర్ నియోజ‌క వర్గం నుంచి ఆయ‌న ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.  గ‌త నెల రోజుల క్రితం వ‌ర‌కు ముఖ్య‌మంత్రి బీరెన్ సింగ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన గోవిందాస్ అనూహ్యంగా పార్టీ మారుతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో చ‌ర్చినీయాంశంగా మారింది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-