ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా..? కాంగ్రెస్‌ తర్జన భర్జన..!

తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా..? అనే విషయంపై కాంగ్రెస్‌ పార్టీ తర్జన భర్జన పడుతోంది… లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంపై ఇవాళ పీఏసీ సమావేశమై చర్చింది.. అయితే, పోటీపై ఎలాంటి నిర్ణయానికి రానట్టుగా తెలుస్తోంది.. ఇక, నల్గొండలో పోటీ చేయాలా..? వద్దా..? అనేది జిల్లా నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తెలిపినట్టుగా సమాచారం.. మరోవైపు.. రేపటిలోగా అన్ని జిల్లాల నాయకులు చర్చించుకుని సమగ్ర సమాచారాన్ని పీసీసీకి ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ క్యాంపెయిన్‌పై చర్చించారని చెబుతున్నారు.. జిల్లాల్లో డిజిటల్ మెంబెర్షిప్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అందుకు ఆయా జిల్లాల ఇంఛార్జీలుగా ఉన్న వర్కింగ్ ప్రసిడెంట్స్, వైస్ ప్రసిడెంట్స్ క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించింది పీఏసీ.

Read Also : గ్రేటర్‌ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం..

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టుగా తెలుస్తోంది.. ఓవైపు అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కసరత్తు పూర్తిచేసినట్టు తెలుస్తుండగా.. ఇవాళో.. రేపు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.. నామినేషన్లకు కూడా సమయం దగ్గర పడుతోంది.. ఈ సమయంలో.. పోటీపై నిర్ణయం తీసుకోవడానికే ఇంకా తర్జనభర్జన పడుతోంది కాంగ్రెస్‌ పార్టీ. మరి.. పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles