9 మంది నేత‌ల‌తో కాంగ్రెస్ కీల‌క క‌మిటీ… దేనికంటే…

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఈరోజు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  9 మంది సీనియ‌ర్ నేత‌ల‌తో ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు.  ఈ క‌మిటీకి సీనియ‌ర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజ‌య్ సింగ్‌ను చైర్మ‌న్‌గా నియ‌మించారు.  జాతీయ స్థాయిలో పోరాటాల‌కు ప్ర‌ణాళిక‌లను రూపోందించే ఈ క‌మిటీలో ప్రియాంక గాంధీ, ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, మ‌నీశ్ ఛ‌త్ర‌త్‌, బీకే హ‌రిప్ర‌సాద్‌, రిపున్ బోరా, ఉదిత్ రాజ్‌, రాగిణి నాయ‌క్‌, జుబిర్ ఖాన్ లు స‌భ్యులుగా ఉండ‌బోతున్నారు. దేశంలోని స‌మ‌స్య‌ల‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. 

Read: తెలంగాణ క‌రోనా అప్డేట్‌: కొత్త‌గా కేసులు ఎన్నంటే…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-