ఇందిరాపార్క్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌…ర్యాలీ జ‌రుగుతుందా?

దేశంలోని అన్నిరాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు పిలుపునిచ్చింది.  కాంగ్రెస్ నేత‌ల ఫోన్ ట్యాపింగ్‌కి నిర‌స‌న‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకుంది.  ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు ర్యాలీని నిర్వ‌హించి రాజ్‌భ‌వ‌న్ ముందు ఆందోళ‌న నిర్వ‌హించి గ‌వ‌ర్న‌ర్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో ఇందిరాపార్క్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. వ‌ర్షాన్నిసైతం లేక్క‌చేయ‌కుండా ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.  అయితే, ర్యాలీకి అనుమ‌తి లేక‌పోవ‌డంతో పోలీసులు పెద్ద‌సంఖ్య‌లో ఇందిరాపార్క్ వ‌ద్ద మోహ‌రించారు.  పోలీసులు అడ్డుకున్నా చ‌లో రాజ్‌భ‌వ‌న్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి తీరుతామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. 

Read: ఇష్క్ : “చీకటి చిరు జ్వాలై” లిరికల్ వీడియో సాంగ్

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-