కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తల్లి..

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… 2017 ఉన్నావ్ అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా… ఇప్పుడు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని ఎన్నికల బరిలోకి దింపింది కాంగ్రెస్‌ పార్టీ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంది. 19 ఏళ్ల బాధితురాలి తల్లి పేరును పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈరోజు విడుదల చేశారు. బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.. మీరు వేధింపులు, చిత్రహింసలకు గురైనట్లయితే, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మా జాబితా కొత్త సందేశాన్ని పంపుతుందని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు..

Read Also: ఈ సారి ఐపీఎల్‌ అక్కడేనా..?

ఇక, మహిళలకు నలభై శాతం టిక్కెట్లు రిజర్వ్ చేశామని ప్రియాంక తెలిపారు.. ప్రజల సమస్యలపై పోరాడాలని అభ్యర్థులకు సూచించిన ఆమె.. ప్రతికూల ప్రచారాలకు తావివ్వబోమని, దళితులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిపైనే మా ప్రచారం ఉంటుందన్నారు.. యూపీలో నేను ప్రారంభించిన పనిని కొనసాగిస్తాను.. ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలోనే ఉంటానన్న ఆమె.. యూపీలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం అన్నారు. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం బయట బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉన్నావ్ రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. సెంగార్ సోదరుడు తన 55 ఏళ్ల తండ్రిని కొట్టడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. మరుసటి రోజు అతను మరణించాడు, అతనికి తగిలిన గాయాల కారణంగా చనిపోయినట్టు నివేదికలు స్పష్టం చేశాయి.. అయితే, ఆ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు, సంస్థలు, ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.

Related Articles

Latest Articles