ఉద్యోగ ఖాళీల గురించి ప్రభుత్వానికే స్పష్టత లేదు: ఎమ్మెల్యే శ్రీధర్

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయిందని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శించారు. మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఏదో ఒకరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు వస్తుందన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల గురించి ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఖాళీల విషయంలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం.. యువతి యువకులకు ఏలాంటి భరోసా కల్పిస్తుందని ప్రశ్నించారు. ఉద్యోగ అర్హతకు ప్రభుత్వం వయస్సు వెసలు బాటు కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని వేల యువకుల బలిదానాలు అయినాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తితో పాటు జాబ్ క్యాలెండర్ చిత్తశుద్ధితో విడుదల చేయాలి. ఇంటికో ఉద్యోగం అని చెప్పి గెలిపొందిన వారు ఓటువేసిన వారికి సమాధానం చెప్పాలన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులను అదే స్థానంలో కొనసాగిస్తుండడంతో యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-