జగ్గారెడ్డి హాట్ కామెంట్స్.. కొడాలి నానికి చురకలు

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కీలక కామెంట్లు చేశారు. ఆంధ్రా రాజకీయం ప్రశాంతంగా జరిగేలా జగన్ చొరవ తీసుకోవాలి. పగలు..ప్రతీకారం వరకు వెళ్ళకండి. కొడాలి నాని మాటలు మార్చుకుంటే బెటర్. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు నాని ఎక్కడ ఉన్నాడు. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగిందన్నారు జగ్గారెడ్డి.

టీడీపీ వాళ్ళు కూడా మీ కుటుంబాన్ని అంటే ఎలా ఉంటుంది? ఏపీతో నాక్కూడా అనుబంధం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా అన్నారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి కి ఎందుకు ఆంధ్రా రాజకీయం అనుకునేరు. సీఎం జగన్ ఇప్పటికైనా… చొరవ తీసుకోవాలి. ఇలా పోతే… పగలు పెరిగిపోతాయి. లూప్ హోల్స్ అందరికీ ఉంటాయి. ఆంధ్రా రాజకీయం ప్రశాంతంగా జరిగేలా చొరవ తీసుకోవాలి, పగలు..ప్రతీకారం వరకు వెళ్ళకండి.

నా మీద ఏదైనా మాట్లాడితే… ఇప్పుడు మర్యాదగా మాట్లాడుతున్నా. మీరు తేడాగా స్పందిస్తే… మీ అందరి గురించి నాకు తెలుసు. కొడాలి నాని మాటలు మార్చుకుంటే మంచిదని చురకలంటించారు జగ్గారెడ్డి. చంద్రబాబు హయాంలో రోజాను వ్యక్తిగతంగా అని ఉంటే అదీ తప్పే. బీజేపీ కూడా వ్యక్తి గత దూషణల రాజకీయం మొదలుపెట్టింది. కాంగ్రెస్ లో అలాంటి కల్చర్ లేదు. అవతలి వాడు మమ్మల్ని టెంప్ట్ చేస్తేనే అంటాం. కానీ మేము ఎవరిని కావాలని వ్యక్తిగత దూషణలు చేయలేదు. కెసిఆర్ మమ్మల్ని సన్నాసి అంటే..మేము అంటాం, కానీ…మేము అలా అనం అన్నారు జగ్గారెడ్డి.

Related Articles

Latest Articles