కాంగ్రెస్ నేత కీల‌క వ్యాఖ్య‌లు: మోడీ డైరెక్ష‌న్‌లో హైడ్రామా…

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు కేంద్రం ముంద‌డుగు వేసింది.  కృష్ణా, గోదావ‌రి జ‌లాలకు సంబందించిన అన్ని విష‌యాలు బోర్డులే చూసుకుంటాయ‌ని చెప్పి గెజిట్‌ను విడుద‌ల చేసింది.  ఈ గెజిట్ అక్టోబ‌ర్ 14 వ తేదీ నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని తెలియ‌జేసింది.  గెజిట్ నోటిఫికేష‌న్‌ను ఆంధ్ర‌నేత‌లు ఆహ్వానిస్తుంటే, తెలంగాణ నేత‌లు వ్య‌తిరేకిస్తున్నారు.  ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు జ‌లాల విష‌యాన్ని బోర్డుల‌కు అప్ప‌గించ‌డంపై మండిప‌డుతున్నారు.

Read: రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్

ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు మోడీ, కేసీఆర్‌, జ‌గ‌న్‌లు నాట‌కం అడుతున్నారని, మోడీ డైరెక్ష‌న్‌లోనే ఈ డ్రామా న‌డుస్తోంద‌ని కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు.  రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, కాంగ్రెస్ పార్టీని రాకుండా చేసేందుకే ముగ్గురు క‌లిసి ఇలాంటి ఎత్తులు వేస్తున్నార‌ని అన్నారు.  అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క కూడా కేంద్రం నిర్ణ‌యంపై మండిప‌డింది.  నీళ్లు, ఉద్యోగాల కోస‌మే తెలంగాణ ఉద్య‌మం జ‌రిగింద‌ని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కూడా మ‌రోసారి నీళ్ల‌కోసం ఉద్య‌మం చేయాల్సి వ‌స్తుందేమో అనే సందేహాన్ని వ్య‌క్తం చేసింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-