కాంగ్రెస్ పోటీలోకి రావడంతో టీఆర్ఎస్ నేతలు ఆనందంగా ఉన్నారు : జగ్గారెడ్డి

స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, డాక్టర్ సంజీవ్ రెడ్డి మండల, టౌన్, బ్లాక్ ప్రెసిడెంట్స్ ,ఎంపీటీసీ, కౌన్సిలర్ లు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ… స్థానిక నేతలకు మంత్రి హరీష్ రావు అపాయింట్ మెంట్ ఇచ్చేవాడే కాదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో పెట్టగానే అందరికి ఇంటింటికి ఫోన్ లు చేస్తున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే కేసీఆర్ స్థానిక సంస్థల నాయకుల విషయంలో దిగివస్తారు. దిగిరావడమే కాదు స్థానిక నేతలు ఎంత ముఖ్యమో గమనించి నిధులు విడుదల చేస్తారు. స్థానిక నేతల హక్కులను కలరాస్తున్నాము ఇదే ప్రమాదమే అని కేసీఆర్ కచ్చితంగా గుర్తిస్తారు అని అన్నారు.

అయితే కాంగ్రెస్ హయంలో స్థానిక నేతలకు ఫుల్ గా నిధులు మంజూరు అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ రాజు లాగా బ్రతికరు. కాంగ్రెస్ పార్టీకి పవర్ కొత్తేమి కాదు. దేశంలో,రాష్ట్రంలో, మెదక్ లో కాంగ్రెస్ దే చరిత్ర. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కి 8 స్థానాలు ఉండే.. కానీ ఇప్పుడు మెదక్ లో టీఆర్ఎస్ ఎనిమిది కాంగ్రెస్ కి ఒకటి ఉండొచ్చు కానీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి 8 టీఆరెస్ 2 సీట్లకు రావొచ్చు. కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో పెట్టాక టీఆర్ఎస్ స్థానిక నేతలు ఆనందంగా ఉన్నారు. నాందేడ్ రోడ్డు కాంగ్రెస్ హయాంలోనే మంజూరు అయ్యింది. మనకు ఉన్న 230 ఓట్లతో పాటు టీఆర్ఎస్ నేతలు ఎవరైనా వస్తే కూడా వారి ఓట్లు వేయించాలి అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles