జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. రేవంత్‌, కోమటిరెడ్డి మధ్య..!

కాంగ్రెస్‌ పార్టీలో నేతల తీరు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది.. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు.. దీంతో ఎవరికి తోచినట్టు వారు చేసేస్తుంటారు.. అయితే, కాంగ్రెస్‌ పార్టీలో తాజా పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పార్టీలో కొంత కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందని.. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి ముగ్గురు ముఖ్యమేనని మీడియా చిట్‌చాట్‌లో అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి, పీసీసీ కొత్త కమిటీకి గ్యాప్ ఉందని.. కాకపోతే అందరం కలిసి పని చేయాలని అందరూ కోరుకుంటున్నారన్నారు.

ఇక, పీసీసీపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై నేను పార్టీలో మాట్లాడతానన్న జగ్గారెడ్డి.. మీడియాతో పీసీసీ మీద మాట్లాడ వద్దని సూచన చేస్తానన్నారు.. కోమటిరెడ్డికి బాధ, ఆవేదన ఉందని.. సొంత కొడుకు, సవితి కొడుకు పంచాయతీ ఉంటుందన్నారు. కోమటిరెడ్డికి పార్టీ మీద కోపం ఉంటే పార్టీలో ఉండేవాడు కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి.. కానీ, ఆయనకు పార్టీ మీద ప్రేమ ఉందన్నారు. ఇక, ఎమ్మెల్యే సీతక్క.. చంద్రబాబుకి రాఖీ కట్టడం తప్పుకాదు.. కోమటిరెడ్డి.. వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడం కూడా తప్పన్నారు. అయినా.. తప్పు, ఒప్పుల గురించి మాట్లాడే సమయం కాదన్నారు.. వైఎస్ మీద అందరికీ అభిమానం ఉందని.. కొందరు ఆత్మీయ సమ్మేళలానికి వెళ్లారు.. ఇంకొందరు వెల్లలేక పోయారన్నారు. అయితే, రేవంత్‌, కోమటిరెడ్డికి మధ్య ఉన్న గ్యాప్‌ క్లియర్‌ చేసే ప్రయత్నం చేస్తానన్నారు జగ్గారెడ్డి.. కాంగ్రెస్ లో కొట్లాటలు కామనన్న ఆయన.. హుజురాబాద్ ఎన్నికల వాయిదా… అవగాహనలో భాగమేనని ఆరోపించారు. కేసీఆర్‌, అమిత్‌షా ముందు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారు.. మరి బండి సంజయ్‌కి విలువ ఉన్నట్టా? అని ప్రశ్నించారు. బండి సంజయ్… సీఎం నీ జైల్లో పెడతా అని వంద సార్లు అన్నాడు.. మరి జైల్లో పెట్టించే అమిత్ షా దగ్గర కేసీఆర్‌ దర్జాగా కూర్చున్నారు.. గల్లీలో మాట్లాడే సంజయ్ మాటలకు విలువ ఉన్నట్టా? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-