కార్పొరేట్ శక్తులను పెంచే పనిలో పడింది మోడీ ప్రభుత్వం…

కార్పొరేట్ శక్తులను పెంచే పనిలో పడింది మోడీ ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. కుల వృత్తులు కూడా కార్పొరేట్ శక్తులు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న.. తెలంగాణ, ఏపీ లో ఆందోళనలు లేకపోవడం దురదృష్టకరం. రైతులు బయటకు రాకపోవడం కి పోలీసు కేసులు కారణం అని అన్నారు. జగన్, కెసిఆర్ పోలీసుల తో కేసులు పెట్టిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై కనీసం జగన్, కెసిఆర్ మాట్లాడటం లేదు. రైతుల కోసం కొట్లడేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు. ప్రియాంక, రాహుల్, సోనియా గాంధీ లు మాత్రమే కొట్లాడతారు. యోగి, మోడీ.. ప్రభుత్వం రైతులను చంపుతుంది. ఇప్పటి వరకు రైతులను చంపిన మంత్రి కొడుకుని అరెస్ట్ చెయ్యలేదు. తప్పు అని అడిగిన ప్రియాంక గాంధీ నీ అరెస్టు చేయిస్తున్నారు. ప్రభుత్వాలే రైతులను చంపుతుంటే… ఎవరికి చెప్పుకోవాలి అని పేర్కొన్నారు.

-Advertisement-కార్పొరేట్ శక్తులను పెంచే పనిలో పడింది మోడీ ప్రభుత్వం...

Related Articles

Latest Articles