జగ్గారెడ్డి దీక్ష రద్దు

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే.. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగారెడ్డి నియోజకవర్గం, జిల్లాలోని గ్రామపంచాయతీ పరిధిలోని ఇల్లీగల్ లేఔట్స్‌, ఇళ్ల నిర్మాణాలను ఎల్‌ఆర్‌ఎస్ మరియు బీఆర్ఎస్‌ ద్వారా క్రమబద్దీకరణ చేయాలన్న డిమాండ్‌తో దీక్షకు ప్లాన్‌ చేశారు.. అయితే, పోలీసులు జగ్గారెడ్డి నిరసన దీక్షకు అనుమతి ఇవ్వలేదు.. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించడానికి లేదంటూ దీక్షకు అనుమతి నిరాకరించారు.

Read Also: కరోనా విజృంభణ.. సంక్రాంతి తర్వాత స్కూళ్లు నడిచేనా..?

తాజా పరిస్థితులపై స్పందించిన జగ్గారెడ్డి.. అనుమతి లేని కారణంగా తన దీక్షను వాయిదా వేసుకున్నట్టు ప్రకటించారు.. సంక్రాంతి తర్వాత మరోసారి గ్రామపంచాయతీ పరిధిలోని ఇల్లీగల్‌ లేఔట్, అనుమతి లేకుండా కట్టుకున్న ఇళ్లను ఎల్‌ఆర్ఎస్, బీఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయాలనే దానిపై కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.. ప్రస్తుతానికి నేడు తలపెట్టిన దీక్షను రద్దు చేసినట్టు వెల్లించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.

Related Articles

Latest Articles