కూలీ పనులకు వెళ్ళండన్న మంత్రి క్షమాపణలు చెప్పాలి: సునీత రావు

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు కూలీ పని చేసుకుంటే తప్పేంటని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. హమాలీ పనితో ఉపాధి కల్పిస్తున్నామని, హమాలీ పని మాత్రం ఉపాధి కాదా అని ప్రశ్నించారు. అయితే నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఖండించారు. వెంటనే నిరుద్యోగులకు మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఉద్యోగాలు భర్తీ చేయలేని, చేత కానీ ప్రభుత్వం అంటూ విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగ యువకులను కూలీ పనులు చేసుకోండి అని చెప్పడం ప్రభుత్వం చేత కానీ తనంకి నిదర్శనం అంటూ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91,000 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్టు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-