కేటీఆర్‌ చరిత్ర మరిచారు.. అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తాం..!

టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.. కేటీఆర్ మరోసారి ఇలా రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తాం.. జాగ్రత్త అని హెచ్చరించారు.. కేటీఆర్‌ ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు అంటే .. దానికి కారణం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వబట్టేనని గుర్తుచేసిన ఆయన.. చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇక, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను పూర్తిగా నాశనం చేశారని ఫైర్ అయిన సంపత్‌.. కాంగ్రెస్ చిన్న పార్టీ అంటూ కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ చరిత్ర కేటీఆర్ కు తెలవక పోవడం దౌర్భాగ్యం అన్నారు.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందనే భయంతోనే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారన్న ఆయన.. కేసీఆర్ లాగా రాష్ట్ర ప్రయోజనాలు మహారాష్ట్రకు తాకట్టు పెట్టి ఊరేగింపుతో రాలేదని ఎటాక్ చేశారు.

కేటీఆర్ కు ధైర్యం ఉంటే ఫిరాయింపుల మీద బహిరంగ చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు సంపత్.. ఫిరాయింపులపై టీఆర్ఎస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లేనన్న ఆయన.. రేవంత్ రెడ్డి.. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు స్పీకర్ ఫార్మాట్‌లో చంద్రబాబుకు రాజీనామా లేఖ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాపై మీకు కృతజ్ఞత లేదు.. కానీ, తెలంగాణ ఇచ్చిన సోనియా నేతృత్వంలో పనిచేయాలనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే రేవంత్ లాగా కాంగ్రెస్ అధ్యక్షుడికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇవ్వాలని సూచించిన ఆయన.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా.. లేక రాళ్ల దెబ్బలు తింటారా? బాల్ వారి కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించారు. ఆ ఎమ్మెల్యేలను వదిలిపెట్టే సమస్యే లేదు.. ఏ పుట్టలో దాగిపున్నా వదలమని హెచ్చరించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-