కరోనా వైద్యం, వ్యాక్సిన్ ఉచితంగా అందించాలి : శైలజానాథ్

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్, ఆ పార్టి నేతలు. ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేయాలని, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని గవర్నర్ కు వినతి పత్రం అందచేసిన సాకే శైలజానాథ్ అనంతరం మాట్లాడుతూ… దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. మాటలు చెప్పకుండా ఏకీక్రుత విధానంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలి. భారత్ బయోటెక్ మంచి నీటి బాటిల్ కన్నా తక్కువ ధరకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కానీ ధరలు పెంచి విపరీతంగా దండుకుంటున్నారు. కేంద్రం బడ్జెట్ లో చెప్పిన విధంగా 35 వేల కోట్లు వ్యాక్సిన్ కు ఖర్చు చేయాలి. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయడం కాదు కేంద్రాన్ని నిలదీయాలి. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారని ఆక్సిజన్ అందక చనిపోవడం జరుగుతుందని అన్నారు. గ్లోబల్ టెండర్లకు ఎవరూ రాలేదని లెటర్లు రాయడం కాదు. ఒత్తిడి తేవాల్సింది కేంద్రం పైన అన్నారు. అలాగే వ్యాక్సిన్, వైద్యం ఉచితంగా చేయించాలి. థర్డ్ వేవ్ ద్రుష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీ తరుపున రోడ్డెక్కి నిరసనలు తెలుపుతాం అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-