వైఎస్ఆర్ ఆత్మీయ‌ సమ్మేళనానికి ఎందుకు వెళ్లకూడదు… పీసీసీ నిద్ర‌పోతుందా?

వైఎస్ఆర్ ఆత్మీయ స‌మ్మేళ‌నానికి అనేక మంది మాజీ మంత్రులు, నేత‌లు హాజ‌ర‌య్యారు.  ఈ స‌మావేశానికి కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు.   ముఖ్య‌మంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపించిన వ్య‌క్తి వైఎస్ఆర్ అని, విజ‌య‌మ్మ ఆహ్వానం మేర‌కు త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని చెప్పాన‌ని, చెప్పిన‌ట్టుగానే వ‌చ్చాన‌ని అన్నారు.  ఉద‌యం 7గంట‌ల‌కు తాను బ‌య‌లుదేరి వ‌చ్చిన‌ట్టు తెలిపారు.  ఆత్మీయ స‌మావేశానికి ఎందుకు వెళ్ల‌కూడ‌ద‌ని కాంగ్రెస్ ఆదేశాలు ఇచ్చిందో తెలియ‌ద‌ని అన్నారు.  పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్య‌క్తి  వైఎస్ఆర్ అని, మండుటెండ‌లో పాద‌యాత్ర చేసిన వ్య‌క్తి అని కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీ నేత వ‌ద్ద‌కు వెళ్లి కాళ్లు మోక్కార‌ని, తాను వ‌చ్చింది కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి స‌భ‌కు అని అన్నారు. మా కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన వ్య‌క్తి స‌భ‌కు పోవ‌ద్ద‌ని ఆదేశాలు ఇవ్వ‌డం అనేది పిచ్చి చ‌ర్య‌గా ఆయ‌న వ‌ర్ణించారు.  ఆదేశాలను విత్‌డ్రా చేసుకోవాల‌ని అన్నారు.  నియోజ‌క వ‌ర్గ ప‌రిధిలో ఇత‌ర పార్టీల నేత‌లు చ‌నిపోతే సంతాప స‌భ‌ల‌కు వెళ్తాం అని, అలాంటిది మా సీఎం స‌భ‌కు పోవ‌ద్ద‌న‌డం క‌రెక్ట్ కాద‌ని అన్నారు.  మూడు రోజుల నుంచి విజ‌య‌మ్మ అంద‌రినీ ఆహ్వానిస్తున్నార‌ని, పీసీసీ నిద్రయిందా అని కోమ‌టిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

Read: భాగ్య‌న‌గ‌రంలో భారీ వ‌ర్షం…

Related Articles

Latest Articles

-Advertisement-