హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజురాబాద్‌ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు బీసీ మంత్రం ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్‌ కూడా బీసీ కార్డునే ప్రయోగించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్‌ బరిలో దించనున్నట్టు సమాచారం. అక్కడ ఉన్న ఓటు బ్యాంక్‌.. సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని సురేఖను వ్యూహాత్మకంగా బరిలో దింపుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఇంకా ఆమె ను కాంగ్రెస్‌ పార్టీ ఫైనల్‌ చేయలేదు. ఈ నేపథ్యం లో కాంగ్రెస్‌ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ఆశావహుల నుండి దరఖాస్తులను ఆహ్వానించాలని పిసిసి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టికెట్ ఆశావాహుల నుండి.. ఫీజు వసూలు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. హుజూరాబాద్ టికెట్ కోసం దరఖాస్తు దారుల నుండి రూ. 5 వేల వసూలు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇప్పటికే హుజురాబాద్‌ ఉప ఎన్నిక అభ్యర్థిగా గెల్లు శ్రీనువాస్‌ ను టీఆర్‌ఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-