“సీటిమార్” అంటున్న ప్రభాస్

మాచో హీరో గోపీచంద్ చాలా కాలం తరువాత “సీటిమార్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు కావడమే దీనికి కారణం. కాగా తాజాగా తన ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ కూడా “సీటిమార్” అంటూ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.

Read also : మహేష్ బాటలో విజయ్ దేవరకొండ… థియేటర్ రెడీ

“నా స్నేహితుడు గోపీచంద్ “సీటీమార్‌”తో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆయనకు చాలా సంతోషంగా ఉంది!. ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ, కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మొదటి పెద్ద చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు చిత్ర బృందానికి అభినందనలు” అంటూ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో తమన్నా, భూమిక చావ్లా, రహమాన్ ముఖ్యమైన పాత్రలు చేసారు. దిగంగన సూర్యవంశీ రిపోర్టర్ పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించింది.

Image

Related Articles

Latest Articles

-Advertisement-