మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ మధ్య వాగ్వాదం

యాదాద్రి భువనాగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజాగోపాల్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు వేదిక పైకి రాగానే ఇరు వర్గాల కార్యకర్తలు హోరా హోరీగా నినాదాలు చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన చేయడంతో… ఇరు పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య రసాభాసగా మారింది రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం.

Read Also : ధోనితో రణ్వీర్ సింగ్ ఫుట్ బాల్ మ్యాచ్… పిక్స్ వైరల్

ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యేకి కనీస సమాచారం లేకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారని మంత్రి జగదీష్‌ రెడ్డిని నిలదీశారు. మునుగోడు నియోజకవర్గం లో ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం కాదని.. ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉమ్మడి నల్గొండ మంత్రి జగదీష్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ తో కొట్లాడి మునుగోడు నిధులు అందించాలని డిమాండ్‌ చేశారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-