తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల కుదింపు

టెన్త్‌ పరీక్షా పేర్లను కుదించారు. ఈ ఏడాది పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 11 పేపర్లకు బదులుగా ఆరు పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే.. ఈ సారి పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాలకు (అరగంట పెంపు) పెంచుతూ కీలక నిర్నయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు.. పరీక్ష పేపర్ లో విద్యార్థుల కు ఎక్కువ ఛాయిస్ ఉండే విధంగా ప్రశ్నల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో టెన్త్‌ విద్యార్థులు కాస్త ఊరట లభించే అవకాశం ఉంది.

-Advertisement-తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల కుదింపు

Related Articles

Latest Articles