బాలుతో చిన్ననాటి ఫోటో పంచుకున్న తమన్

నేడు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి కావడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నివాళులు అర్పించింది. చాలా మంది ప్రముఖులు ఆయన్ను స్మరించుకున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ బాలు లేని లోటు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగాలకు లోనయ్యారు. ‘మిస్ యూ మామా’ అంటూ చిన్ననాటి ఫోటో షేర్ చేశారు. 1996 దక్షిణ కొరియాలోని సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమన్ కలిసి ఉన్నప్పటి ఫొటో అది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వెళుతుండగా ఆ ఫొటో తీసుకున్నట్టు తమన్ వెల్లడించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-