ప్రకాశం జిల్లాలోని ఆ పట్టణంలో పూర్తిస్థాయి లాక్ డౌన్… 

ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.  ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో 24 గంటలపాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.  రేపు ఉదయం నుంచి కర్ఫ్యూ సమయంలో ఉన్న సడలింపులు అమలు చేయనున్నారు.  పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో బస్సులను కనిగిరి డిపోకు పరిమితం చేశారు.  పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు జరుగుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.  లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి అనవసరంగా ఎవరైనా వస్తే వారికీ పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తున్నారు పోలీసులు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-