ఇక వరసగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లు.. తేదీలు ఇవిగో..

కరోనా మహమ్మారి కారణంగా చాలా పరీక్షలు రద్దు కాగా.. కొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు.. ఇక, కామన్‌ ఎంటెన్స్‌ టెస్ట్‌లను కూడా పలు దపాలుగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఎంట్రెన్స్‌ టెస్ట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. దీంతో.. వరుసగా కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలు జరగబోతున్నాయి. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి… రేపటి నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు వరసగా ఎంట్రెన్స్ లు జరగబోతున్నాయి.
వివిధ రకాల ఎంట్రెన్స్‌ టెస్ట్‌ల తేదీలను పరిశీలిస్తే…

 • జులై 17న పాలిసెట్ (పాలిటెక్నిక్, బాసర ఐఐఐటీ అడ్మిషన్స్ కోసం..)
 • జులై 20, 22, 25, 27 తేదీల్లో జేఈఈ మెయిన్
 • ఆగస్టు 3న ఈసెట్
 • ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్…
 • ఆగస్టు 9, 10 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్
 • ఆగస్టు 11 నుండి 13 వరకు పీజీ ఈసెట్
 • ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్
 • ఆగస్టు 23న లా, పీజీ లా సెట్
 • ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్
 • ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 2 వరకు జేఈఈ మెయిన్ నాలుగో విడత..
 • సెప్టెంబర్ 11 న నీట్ పిజి ఎంట్రెన్స్
 • సెప్టెంబర్ 12న నీట్ యూజీ ఎంట్రెన్స్ ఇలా వరుసగా పరీక్షలు జరబోతున్నాయి..

మరోవైపు.. రేపు తెలంగాణ పాలిసెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఈ పరీక్షకు లక్షా 2,496 మంది విద్యార్థులు దారఖాస్తు చేసుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 411 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా.. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు.. అభ్యర్థులకు పది గంటల నుండే పరీక్ష హాల్ లోకి అనుమతి ఇవ్వనుండగా.. 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన నో ఎంట్రీ అని స్పష్టం చేశారు.. ఇక, పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ర్యాంక్ ల ద్వారా… పాలిటెక్నిక్ కళాశాలలు, బాసర ఐఐఐటీ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొందే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-