దిశ ఎన్‌కౌంటర్‌.. పోలీసులకు బిగుస్తున్న ఉచ్చు..?

దిశ అనే డాక్టర్‌ని నలుగురు నిందుతులు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో కలకలం రేపింది. అయితే నిందితులను సీన్‌ రికన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు తీసుకెళితే తప్పించుకునేందుకు ప్రయత్నించారని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌ కౌంటర్‌ బూటకమని నిందితుల కుటుంబీకులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు దిశ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తాజాతా
దిశ కమిషన్ ముందు బాధిత కుటుంబాల తరపు న్యాయవాదులు పీవీ కృష్ణమా చారి, రజిని లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు వేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుందని తెలిపారు. ఇప్పటి వరకు కమిషన్ సభ్యులు చూసిన సాక్ష్యులు మొత్తం ఇది ఫేక్ ఎన్ కౌంటర్ లాగే ఉన్నాయినట్లు గుర్తించారని, చనిపోయిన వారిలో ముగ్గురు మైనర్లు అని కమిషన్ కు తెలిపామన్నారు. ముగ్గురు నిందితులు మైనర్లు అని తెలిసినా జ్యువైనల్ హోమ్ కు తరలించలేదని, ముగ్గురిని చర్లపల్లి జైలు కు తరలించారని, జాతీయ మానవ హక్కుల కమిషన్ నిబంధనలు పాటించలేదని స్పష్టం చేశారు.

‘ఇది ముమ్మాటికీ ఫేక్ ఎన్ కౌంటర్ అని కమిషన్ కు చెప్పాము. చనిపోయిన వ్యక్తులకు గాయలున్నాయని కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు ముద్దాయులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో చంపేశారు. ఎన్ కౌంటర్ చేసిన వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలి. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలి. న్యాయవ్యవస్థ ను పోలీసులు చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని కమిషన్ కు వివరించాం. ఫిబ్రవరి లోపు కమిషన్ విచారణ పూర్తి చేసే అవకాశం ఉంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని బాధిత కుటుంబాల న్యాయవాదులు వెల్లడించారు.

Related Articles

Latest Articles