టీ 20: త‌క్కువ ప‌రుగుల‌కే ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌…శ్రీలంక టార్గెట్ 82…

కొలంబో వేదిక‌గా ఇండియా, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో టీ 20 మ్యాచ్ జ‌రుగుతున్న‌ది.  ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ది.  అయితే, మ్యాచ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌స‌గా వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది.  20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి కేవ‌లం 81 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 2008లో ఆస్ట్రేలియాపై చేసిన 74 ప‌రుగుల అత్య‌ల్ప స్కోరు త‌రువాత ఇదే రెండో అత్య‌ల్ప స్కోర్ కావ‌డం విశేషం.  36 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయిన టీం ఇండియాను టేలెండ‌ర్లు ఆదుకున్నారు.  కుల‌దీప్ యాద‌వ్ 23 ప‌రుగులు, భువ‌నేశ్వ‌ర్ కుమార్ 16 ప‌రుగులు చేయ‌డంతో 81 ప‌రుగులు చేయ‌గ‌లిగింది.  శ్రీలంక స్పిన్న‌ర్ హ‌స‌రంగ 9 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా, డాసున్ శ‌న‌క 20 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. 

Read: పోలీస్ క‌మీష‌న‌ర్‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం… ఎందుకంటే…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-